: వారణాసిలో మోడీకి అనుమతినివ్వాలని ఢిల్లీలో ర్యాలీ చేసిన బీజేపీ
వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. వీరికి మద్దతుగా ఢిల్లీలో ఆ పార్టీ సీనియర్ నేతలు, శ్రేణులతో 'న్యాయ మార్చ్' నిర్వహించాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్ గా వెళ్లి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వీఎస్ సంపత్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.