: అవినీతి కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపండి: మోడీ
పదేళ్లు పాలించిన అవినీతి యూపీఏ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. అవినీతి కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపాలని దేశమంతా కోరుకుంటోందని మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ఇవాళ ఉత్తరప్రదేశ్ లోని అజంఘడ్ లో జరిగిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. మంచి రోజులు రాబోతున్నాయని మోడీ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు.