: 'అత్యాచార నేర నిరోధక బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం
'అత్యాచార నేర నిరోధక బిల్లు-2013' కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. క్రిమినల్ లా బిల్లు పేరుతో రూపొందించిన ఈ బిల్లు ప్రకారం మహిళలపై అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే వారికి జీవితాంతం జైలు శిక్ష లేదా మరణశిక్ష విధిస్తారు. కాగా, ఇతర లైంగిక దాడుల కేసుల్లో నిందితులకు 20 సంవత్సరాల శిక్ష విధిస్తారు. ఢిల్లీ సామూహిక అత్యాచార సంఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం నేరాల నిరోధానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.