: కొత్తగా ఏర్పడే రాష్ట్రాన్ని ‘తెలుగునాడు’గా మార్చాలి: లగడపాటి
కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘తెలుగునాడు’గా పేరు మార్చాలని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. దీని కోసం అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం తీర్మానం చేయాలని ఆయన కోరారు. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 10 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ఆయన అన్నారు. హైదరాబాదులో ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని లగడపాటి అన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ కొత్త రాష్ట్రంలోనే ప్రమాణస్వీకారం చేయాలని ఆయన కోరారు.