: వాళ్లిద్దరూ మార్నింగ్ వాకింగ్ కు వెళ్లి... తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు
ఉదయపు నడకకని బయల్దేరిన వాళ్లిద్దరూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. గ్రేటర్ హైదరాబాదులోని నార్సింగి చౌరస్తాలో ఇవాళ ఉదయం ఓ కారు అదుపు తప్పి పాదచారుల వైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వారిని లక్ష్మయ్య, పద్మగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.