: సీఎం మొండివైఖరి వల్లే విద్యుత్ ఛార్జీల పెంపు: నారాయణ
విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొండి వైఖరి అవలంభించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో సైతం ఎవరినీ సంప్రదించకుండానే ఛార్జీల పెంపుపై సీఎం ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నారని ఆరోపించారు. దానివల్లే కాంగ్రెస్ పార్టీలో భేదాభిప్రాయాలు వచ్చాయన్నారు.
ఇప్పటికైనా పెంచిన ఛార్జీలు తగ్గించాలని ఆయన డిమాండు చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఇవాళ జరగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ సమస్యలపై ఈ నెల 9వ తేదీన చేపట్టనున్న రాష్ట్రబందుతో బాటు, స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఈ భేటీలో చర్చించారు.