: రేపట్నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు
కేరళ తీరం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటల్లో అది వాయుగుండంగా మారబోతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి. అంతేకాకుండా మరో రెండు రోజుల్లో రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయి. రేపు హైదరాబాదులో వర్షాలు కురిసే అవకాశం ఉంది.