: హిందూపురంలో మంచి మెజారిటీతో గెలుస్తా: బాలకృష్ణ


హిందూపురంలో మంచి మెజారిటీతో విజయం సాధిస్తానని సినీ హీరో నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీలో కీలకపాత్ర పోషిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానంగా... టీడీపీ అధ్యక్షుడి సూచనల మేరకే పార్టీలో తన పాత్ర ఉంటుందని చెప్పారు. హిందూపురంలో ఇవాళ బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ... ఓటింగ్ శాతం పెరగడానికి యువతే ప్రధాన కారణమని అన్నారు. టీడీపీ మంచి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. అభివృద్ధికే ఓటేయాలని తాము ప్రచారం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాలయ్య గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News