: చెన్నంపల్లిలో టీడీపీ, వైఎస్సార్సీపీ ఘర్షణ... కాళ్లు, చేతులు విరిగిన కార్యకర్తలు
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామం రెండు వర్గాలుగా విడిపోయింది. చెన్నంపల్లిలో పోలింగ్ సందర్భంగా రిగ్గింగ్ కు పాల్పడుతున్నారంటూ టీడీపీ ఏజెంట్లను వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో, ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై పడి దాడులకు దిగడంతో ఏడుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. ఐదుగురు వ్యక్తులకు చేతులు, కాళ్లు విరిగాయి.