: చివరి క్షణాల్లో ఊపందుకున్న పోలింగ్
సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఎన్నికల గడువు ముగుస్తుండడంతో చివరి క్షణాల్లో పోలింగ్ ఊపందుకుంది. ఉదయం నుంచి ఉద్ధృతంగా జరిగిన పోలింగ్, భానుడి ప్రతాపానికి మధ్యాహ్నం నెమ్మదించింది. సాయంత్రం కొన్ని చోట్ల వర్షాలు పడడంతో, వాతావరణం చల్లబడింది. దీంతో పోలింగ్ ముగిసేందుకు గడువు దగ్గర పడుతున్నకొద్దీ పోలింగ్ కేంద్రాలవద్ద ఓటర్లు బారులు తీరారు. గడువు ముగిసినప్పటికీ, గడువు ముగిసే సమయానికి (6 గంటలకు) క్యూలో ఉన్న వారంతా ఓట్లు వేయవచ్చు.