: మరో 8 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
సీమాంధ్రలో మరో 8 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ఈ స్థానాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియకు తెరపడింది. వీటిలో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, గుంటూరు జిల్లా పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల, విజయనగరం జిల్లా సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలు ఉన్నాయి. 5 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నవారిని వారు ఓటు వేసేంతవరకు అనుమతిస్తారు. ఇప్పటికే అరకు, పాడేరు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.