: పోలింగ్ స్టేషన్ లోనే కూర్చుని రిగ్గింగ్ అడ్డుకున్న పురందేశ్వరి
రాజంపేట లోక్ సభ నియోజకవర్గంలోని పుంగనూరులోని సదుం పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ రిగ్గింగ్ కు పాల్పడుతుండడాన్ని అడ్డుకున్నానని కేంద్ర మంత్రి పురందేశ్వరి తెలిపారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మిథున్ గెలుపు కోసం ఆయన తండ్రి పెద్దిరెడ్డి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారన్న సమాచారంతో పురందేశ్వరి పోలింగ్ స్టేషన్ లోనే కూర్చుని పోలింగ్ సరళిని పరిశీలించారు. పురందేశ్వరి పోలింగ్ కేంద్రంలో కూర్చోవడంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాయి.