: నాకు నోటీసులొచ్చాయి: లగడపాటి
తనకు ఎన్నికల సంఘం నుంచి నోటీసులు వచ్చాయని మాజీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాననే కారణంతో ఎన్నికల సంఘం తనకు నోటీసు జారీ చేసిందని ఆయన తెలిపారు. అయితే తాను కోడ్ కి లోబడి మాట్లాడానని, జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానే తప్ప సర్వే వివరాలు వెల్లడించలేదని లగడపాటి చెప్పారు.