: దెందులూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కారుమూరిపై టీడీపీ దాడి


పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ, పెదవేగి మండలంలోని ఓ గ్రామంలో వైఎస్సార్సీపీకి ఓటేస్తానన్న దళిత ఇంజనీరింగ్ విద్యార్థిపై టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ వర్గీయులు దాడి చేయడంతో అతనిని పరామర్శించేందుకు వచ్చానని అన్నారు. అతనిని పోలీసులకు చూపించి తిరిగి వెళ్తుండగా చింతమనేని ప్రభాకర్ తనపై దాడికి దిగాడని, అడ్డుకున్న తన గన్ మెన్ ను తీవ్రంగా గాయపరిచారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News