: కృష్ణా జిల్లా అధికారులపై సీఈవో భన్వర్ లాల్ సీరియస్
విజయవాడలో పట్టుబడ్డ టీడీపీ నేతల డబ్బు వ్యవహారంలో విచారణను జాప్యం చేయడంతో కృష్ణాజిల్లా అధికారులపై సీఈవో భన్వర్ లాల్ మండిపడ్డారు. రూ. 3 కోట్లు పట్టుబడినట్లు తన వద్ద పక్కా సమాచారం ఉందని అధికారులను ఆయన నిలదీశారు. పట్టుబడిన నగదు వ్యవహారంపై మీరెందుకు విచారణను వేగవంతం చేయడం లేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన నేతలను వదిలిపెట్టొద్దని, కేసు నమోదు చేయాలని భన్వర్ లాల్ ఆదేశించారు. విజయవాడ సిద్ధార్థ అకాడమీ కేంద్రంలో కోట్ల రూపాయల డంప్ బయటపడిన విషయం విదితమే.