: 3 గంటల వరకు 63 శాతం పోలింగ్ నమోదు: భన్వర్ లాల్


మధ్యాహ్నం 3 గంటల వరకు సీమాంధ్రలో 63 శాతం పోలింగ్ నమోదయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతుందని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని అన్నారు.

జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు:
* శ్రీకాకుళం: 63 శాతం
* విజయనగరం: 65 శాతం
* విశాఖపట్నం: 57 శాతం
* పశ్చిమగోదావరి: 67 శాతం
* తూర్పుగోదావరి: 61 శాతం
* కృష్ణా: 60 శాతం
* గుంటూరు: 67 శాతం
* ప్రకాశం: 62 శాతం
* నెల్లూరు: 63 శాతం
* కడప: 65 శాతం
* కర్నూలు: 63 శాతం
* చిత్తూరు: 61 శాతం
* అనంతపురం: 63 శాతం.

  • Loading...

More Telugu News