: ‘కొచ్చాడయాన్’ సినిమాకి చెన్నైలో క్రేజ్... ఇప్పటికే బుక్కయిన 13 వేల టికెట్లు


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కొచ్చాడయాన్’ సినిమా టిక్కెట్లు చెన్నైలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అప్పుడే 13 వేల టికెట్ల అమ్మకాలు జరిగిపోయాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ‘కొచ్చాడయాన్’ విడుదలకు ముందు కార్యక్రమాలు పెళ్లి వేడుకను తలపిస్తున్నాయని పలువురు అంటున్నారు. రజనీ అభిమానులు సినిమా విజయవంతం కావాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చెన్నైలో భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు.

భారతదేశంలో తొలి ఫొటో రియలిస్టిక్ 3D యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ సినిమాగా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తమిళనాడులో మొత్తం 477 థియేటర్లలో విడుదలవుతోన్న ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా పది దేశాల్లో 6 వేల స్క్రీన్లలో ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వారాంతానికి టికెట్లన్నీ అమ్ముడయ్యాయని మల్టీప్లెక్స్ యాజమాన్యం తెలిపింది.

  • Loading...

More Telugu News