: 'జల్లికట్టు' పండుగలో ఎద్దుల వినియోగంపై సుప్రీం నిషేధం


దక్షిణాది రాష్ట్రాల్లో జరుపుకునే 'జల్లికట్టు' పండుగలో ఎద్దులను ఉపయోగించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం నిషేధం విధించింది. వాటితో జల్లికట్టులో ప్రాక్టీస్ చేయడం చట్ట ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని తెలిపింది. జస్టిస్ కె.ఎస్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలోని సింగిల్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇటువంటి కార్యక్రమాల్లో ఎద్దులను ఉపయోగించడం వల్ల పలువురు నష్టపోతారని, ఇలా చేయడం 'ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ద యానిమల్స్ యాక్ట్' కింద నేరంగా పరిగణించబడుతుందని పేర్కొంది. అయితే, శిక్షణ పొందిన ఎద్దులను ప్రదర్శనల కోసం ఉపయోగించేందుకు అనుమతించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. అయితే, తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక అభ్యర్థనల మేరకు గతంలో ఒకసారి కొన్ని షరతులకు లోబడి ఎద్దులను అనుమతించినట్టు సుప్రీం తెలిపింది.

  • Loading...

More Telugu News