: కడపలో టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని రెడ్డివారిపల్లెలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డి స్వగ్రామమైన రెడ్డివారిపల్లెలో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు రాళ్లదాడులకు పాల్పడ్డాయి. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు సర్దిచెప్పినప్పటికీ రెండు వర్గాలు శాంతించకపోవడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు.