: రోజర్ ఫెదరర్ కు మళ్లీ డబుల్ ధమాకా!


స్విట్జర్లాండ్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఇప్పుడు అంతులేని ఆనందంలో మునిగిపోయాడు. దీనికి కారణం, అతని భార్య మిర్కా మళ్లీ ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వడమే! ఈ విషయాన్ని ఫెదరరే ట్విట్టర్లో వెల్లడించాడు. 'నా భార్య మిర్కా, నేను చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సాయంత్రం (గురువారం సాయంత్రం) మాకు లియో, లెన్నీ పుట్టారు. ట్విన్స్ ఎగెయిన్.. మిరాకిల్' అంటూ తన అమితానందాన్ని పంచుకున్నాడు. గతంలో ఈ జంటకు బేబీ గాళ్స్ కవలలు జన్మించగా ఈసారి ఇద్దరూ అబ్బాయిలు పుట్టడం విశేషం.

  • Loading...

More Telugu News