: మార్కెట్లోకి విండో ఎయిర్ కూలర్లు వచ్చేశాయి!
మార్కెట్లోకి మొట్టమొదటి విండో ఎయిర్ కూలర్లు వచ్చేశాయి. ఎయిర్ కూలర్లను తయారుచేస్తున్న ప్రముఖ కంపెనీ సింఫనీ ఐదు మోడళ్లలో విండో కూలర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త ఎయిర్ కూలర్ల ప్రారంభ ధర రూ. 7,500. మోడళ్లను బట్టి రూ. 14 వేల వరకూ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
విండో ఎయిర్ కూలర్లలో 41, 51, 70 మోడళ్లు ప్లాస్టిక్ బాడీ కూలర్లు కాగా, ఆర్ 28, 28ఐ మోడళ్లు మెటల్ బాడీ కూలర్లు. ఈ కూలర్లను డ్యూరా పంప్ టెక్నాలజీ, రిమోట్, ఆట్ మేటిక్ గా నీటిని నింపేందుకు ఇన్ బిల్డ్ ఫ్లోట్ వాల్వ్ వంటి అధునాతన ఫీచర్లతో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.