: 11 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు
ఉదయం 11 గంటల వరకు సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పోలింగ్ సరళిని రాష్ట్ర పధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో 33 శాతం, కడప 32, అనంతపురం 32, చిత్తూరు 33, కర్నూలు 41, కృష్ణా 30 శాతం, గుంటూరు 35, ప్రకాశం 34, శ్రీకాకుళం 33, విజయనగరం 34, విశాఖపట్నం 28 శాతం, తూర్పుగోదావరి 28, పశ్చిమగోదావరి జిల్లాలో 35 శాతం ఓటింగ్ నమోదయిందని తెలిపారు. సాయంత్రం వరకు 85 నుంచి 90 శాతం వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఉద్రిక్తతలు తలెత్తిన కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడికి ప్రత్యేక బలగాలు పంపినట్టు తెలిపారు.