: వాహన తనిఖీల్లో యువతి మృతదేహం.. అవాక్కయిన పోలీసులు


సాధారణంగా జరిపే వాహన తనిఖీల్లో యువతి మృతదేహం బయటపడింది. దీంతో ఒక్కసారిగా పోలీసులు అవాక్కయ్యారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఓ కారులో ఈ మృతదేహం కనుగొన్నారు. అనంతరం మృతదేహం విజయవాడకు చెందిన సుష్మప్రియగా గుర్తించారు. పరారయ్యేందుకు యత్నించిన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు యువతిని విజయవాడలో అపహరించి తెనాలిలో హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News