: రైతుని హతమార్చిన పులి
నిజామాబాద్ జిల్లాలో పులి ఓ రైతుపై దాడి చేసి హతమార్చింది. బిచ్కుంద మండలంలోని పెద్దకొడవుగల్ గ్రామ శివారు ప్రాంతంలో ఈ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కుమ్మరి బాలయ్య(58) అనే రైతు తన పొలానికి నీరు పెడుతుండగా అతని మీద అకస్మాత్తుగా పులి దాడి చేసింది. దీనితో బాలయ్య అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.
గ్రామస్తుల ఫిర్యాదుతో సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామశివార్లలో పులి సంచరిస్తోందని ఇంతకుముందే అధికార్లకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
గ్రామస్తుల ఫిర్యాదుతో సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామశివార్లలో పులి సంచరిస్తోందని ఇంతకుముందే అధికార్లకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.