: పోలింగ్ కు కొన్ని గంటల ముందు... పోటీ నుంచి తప్పుకున్న ముగ్గురు జేఎస్పీ అభ్యర్థులు


ఎన్నికలకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్న ఈ తరుణంలో జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఓట్లు చీలకూడదనే ఉద్దేశ్యంతోనే తప్పుకుంటున్నానని చెపుతోన్న విశాఖ జిల్లా ఎలమంచిలి అసెంబ్లీ అభ్యర్థి భీమునిశెట్టి ఆదిబాబు జై సమైక్యాంధ్ర పార్టీకి రాం రాం చెప్పేశారు. ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేశ్ బాబు సమక్షంలో ఆదిబాబు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ జేఎస్పీ అభ్యర్థి శేషాద్రి నాయుడు కూడా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక, ఇవాళ మధ్యాహ్నం విశాఖ లోక్ సభకు జేఎస్పీ తరపున పోటీ చేస్తున్న సబ్బం హరి కూడా తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. విశాఖలో వైఎస్సార్సీపీని ఓడించాలని కూడా సబ్బం హరి పిలుపునిచ్చారు. మరి, ఈ నియోజకవర్గాల్లో ఓటర్లు ఏ విధంగా తీర్పునిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News