: భీమిలిలో కొనసాగుతోన్న ప్రలోభాల పర్వం... ఓటుకు రూ.వెయ్యి పంపిణీ


విశాఖ జిల్లాలోని భీమిలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు దొరికిపోయారు. సోమవారం రాత్రి నుంచి వైఎస్సార్సీపీ నేతలు నగదు, మద్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున పంచుతున్నారని తెలిసింది. వైఎస్సార్సీపీ నేత పోతిన శ్రీను నుంచి పోలీసులు రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News