: స్మృతి ఇరానీ గెలిచి చరిత్రను తిరగరాస్తారు: అరుణ్ జైట్లీ
అమేథీ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ విజయం సాధిస్తారని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. అక్కడ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించి ఆమె చరిత్రను తిరగరాస్తారని ఆయన అన్నారు.
వారణాసి ప్రజలు నరేంద్ర మోడీని కోరుకుంటున్నారని అరుణ్ జైట్లీ చెప్పారు. క్రిమినల్స్ మద్దతుతో వారణాసి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థిని అక్కడి ప్రజలు ఆదరించరని ఆయన అన్నారు. దేశ ప్రజల ముందు రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయని అరుణ్ జైట్లీ చెప్పారు.