: నేడే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్


ఐపీఎల్ ఆరవ సీజన్ ఈరోజు లాంఛనంగా ప్రారంభంకానుంది. దాదాపు 50 రోజుల పాటు క్రికెట్ అభిమానులకు వేసవి ఆహ్లాదాన్ని పంచనున్న ప్రీమియర్ లీగ్ లో మొదటి మ్యాచ్ ఈ సాయంత్రం ఆరంభమవుతుంది. కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. సొంతగడ్డపై తొలి మ్యాచ్ ను గెలుచుకోవాలని నైట్ రైడర్స్ పట్టుదలగా ఉన్నారు. కాగా, నిన్న సాయంత్రం ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుక కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News