: అసిస్టెంట్ కమాండెంట్ ను కాల్చి చంపేసిన జవాను
భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో భారత భద్రతాదళాధికారిని జవాను కాల్చి చంపాడు. అసిస్టెంట్ కమాండెంట్ గా పని చేస్తున్న జేసి పాండేను కానిస్టేబుల్ అనిల్ కుమార్ కాల్చి చంపారు. పాండే తనపై కక్ష కట్టారని, నిత్యం వేధిస్తూ, తనకు వ్యతిరేకంగా పై అధికారులకు నివేదికలు సమర్పిస్తున్నారని అనిల్ కుమార్ ఆరోపించినట్టు బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు.