: అపాయింటెడ్ డేపై పునః సమీక్షించాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశం
టీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో వాదనలు ముగిశాయి. అపాయింటెడ్ డేను ముందుకు జరపాలని ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది చేసిన వాదనను న్యాయస్థానం అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించింది. అంతేకాక అపాయింటెడ్ డేపై జూన్ 2 కాకుండా మే 16న ప్రకటించాలని కోరడంపై పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.