: మరోసారి గెలుపు కోరుకుంటున్న 93 ఏళ్ల ఎంపీ


దేశంలోనే వృద్ధ ఎంపీగా గుర్తింపు పొందిన 93 ఏళ్ల రామ్ సుందర్ దాస్ మరోసారి గెలిచి పార్లమెంటులోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈయన బీహార్ లోని హాజీపూర్ లోక్ సభ స్థానం నుంచి ప్రస్తుతం పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాజకీయంగా బలమైన లోక్ జనశక్తి అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ తో తలపడుతున్నారు. ఇక్కడ రేపు (7వ తేదీ) ఓటింగ్ జరగనుంది. షిర్టీ సాయిబాబా ఆశీస్సులతో ప్రజలకు దాసుడిగా సేవ చేయడానికి మరోసారి విజయం సాధిస్తానని సుందర్ దాస్ ధీమాగా ఉన్నారు.

  • Loading...

More Telugu News