: ఆక్రోటు మేత.. చక్కెర వ్యాధికి కోత


ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండేవాళ్లు జీడిపప్పు వంటి వాటి జోలికి వెళ్లకుండా.. బాదం, పిస్తా వంటివి తమ చిరుతిళ్ల మెన్యూలో కచ్చితంగా జత చేసుకుంటారు. అలాంటి అలవాటు మీకుంటే.. ఆ జాబితాలో క్రోటు (వాల్ నట్) ను కూడా చేర్చాల్సిందే. ఎందుకంటే.. వారానికి రెండు మూడుసార్లు క్రోటు తినే వారికి చక్కెర వ్యాధి (మధుమేహం) సోకే అవకాశాలు తగ్గుతాయిట. బోస్టన్‌లో దీనికి సంబంధించిన పరిశోధనలు జరిగాయి. దాదాపు లక్షన్నర మంది నర్సుల మీద పరిశోధనలు చేస్తే.. మధుమేహం ఫేజ్‌2 కు వెళ్లే ప్రమాదం 24 శాతం తగ్గినట్టు గుర్తించారుట. మగవాళ్లమీద కూడా ఆక్రోటు ప్రభావం ఇలాగే ఉంటుందని వారంటున్నారు. షుగర్‌ గురించిన భయం మీలో ఉంటే.. ఇక ఆక్రోటు మీద కూడా అప్పుడప్పుడూ నోరు చేసుకుంటూ ఉంటే సరి!

  • Loading...

More Telugu News