: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ పై బీసీసీఐ సస్పెన్షన్ వేటు


రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ పై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసింది. మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీని ఆర్ సీఏ అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఆంగ్ల ఛానల్ ఇంటర్వ్యూలో బీసీసీఐ సెక్రటరీ ఒకరు తెలిపారు. రాజస్థాన్ క్రికెట్ ను మేనేజ్ చేసేందుకు ఓ కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఐపీఎల్ వ్యవహారాల్లో అవకతవకలపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న మోడీపై బీసీసీఐ నిషేధం విధించింది. మళ్లీ రాజస్థాన్ బోర్డు ద్వారా క్రికెట్ వ్యవహారాల్లో పాలుపంచుకునేందుకు ఆయన పోటీ చేస్తుండటంపై బీసీసీఐ గుర్రుగా ఉంటోంది.

  • Loading...

More Telugu News