: అమెరికాలో సోలార్ విమానం..
కరెంటు చార్జీలు నడ్డి విరిచేస్తోంటే మనం ఇక్కడ ఒకవైపు సోలార్ కుక్కర్ లాంటి వాటితో నాలుగు మెతుకులు ఉడకేసుకోవడమే ఒక ప్రయోగంలాగా పాట్లు పడుతున్నాం. అటు అమెరికాలో అయితే ఏకంగా సోలార్ శక్తితో విమానాన్నే నడిపే ప్రయోగాలను రెండో దశలో పరీక్షిస్తున్నారు. ఇదివరకే 26 గంటలు ఎగిరి సక్సెస్ అయిన సోలార్ విమానాన్ని అమెరికా తీరాల మధ్య నడిపి డల్లాస్ చేరుకోవడానికి మే 1న ముహూర్తం నిర్ణయించారు.
ప్రయోగ దశలో పైలట్ మాత్రమే వెళ్లే ఈ విమానానికి భవిష్యత్తులో మరిన్ని మార్పులు చేర్పులు జరుగుతాయిట. కేవలం సౌరశక్తి బ్యాటరీతో మాత్రమే ఈ విమానం నడుస్తుంది. సోలార్ విమానం ప్రయాణ ఇంధన ఖర్చు తగ్గిస్తుంది గనక సంతోషమే!