: సుబ్రతా రాయ్ కు మరోసారి బెయిల్ నిరాకరణ
సహార సంస్థల అధినేత సుబ్రతా రాయ్ కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. రాయ్ ను విడుదల చేయించుకునేందుకు సహారా చేసిన కొత్త ప్రతిపాదనను తిరస్కరించిన కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టి వేసింది. తమ ఉత్తర్వులను సుబ్రతా రాయ్, సహారా పెడచెవిన పెట్టాయని, హైకోర్టు, శాట్ ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారని కోర్టు ఈ సందర్బంగా పేర్కొంది. కాబట్టి, డబ్బు చెల్లింపుకు కొత్త ప్రతిపాదనలతో రావాలని సహారాను సుప్రీం ఆదేశించింది. సహారాలో పెట్టుబడి పెట్టిన వారికి చెల్లించాల్సిన మొత్తం విషయంలో ఇప్పటికి ఆ సంస్థ పలు ప్రతిపాదనలు చేసింది. అందులో ఏవీ సరిగా పూర్తి చేయకపోవడంతో రెండు నెలలుగా సుబ్రతా తీహార్ జైల్లోనే ఉంటున్నారు.