: రోడ్డు ప్రమాదంలో జనగామ నియోజకవర్గ అభ్యర్థి దుర్మరణం
వరంగల్ జిల్లా జనగామ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి శశిధర్ రావు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఉదయం వరంగల్ జిల్లా చినపెండ్యాల వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న శశిధర్ రావు, మరో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు.