: పరిటాల సునీతపై పరువునష్టం దావా వేస్తా: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి


అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతపై పరువునష్టం దావా వేస్తానని... అదే నియోజకవర్గ వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఓటర్లకు వైకాపా నేతలు దొంగ నోట్లు పంచుతున్నారని టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంపై ఆయన మండిపడ్డారు. దొంగ నోట్లు, కల్తీ మద్యం పంచుతున్నది టీడీపీ నేతలే అని ఆరోపించారు. ఓటమి భయంతో సునీత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News