: రాందేవ్ తల తెచ్చిస్తే కోటి రూపాయలిస్తా: బీఎస్పీ నేత ఆఫర్
ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ నేత భగవాన్ సింగ్ చౌహాన్ యోగా గురువు రాందేవ్ బాబా తలకు వెల కట్టారు. రాహుల్ గాంధీ హనీమూన్ కోసమే దళితుల ఇళ్లకు వెళతాడంటూ రాందేవ్ చేసిన వ్యాఖ్యల వల్లే ఆయన ఈ ఆఫర్ చేశారు. రాందేవ్ తలను తీసుకొచ్చి ఇచ్చిన వారికి కోటి రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ వివాదాస్పద ప్రకటన చేశారు. ఈయన హోషియార్ పూర్ లోక్ సభ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాందేవ్ పై తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని, మహిళలు అందరినీ రాందేవ్ అవమానించినప్పుడు తాను ఇలా ప్రకటించడంలో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. దీనిపై హోషియార్ పూర్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ చర్యలకు ఆదేశించారు.