: సీమాంధ్ర జిల్లాల పర్యవేక్షకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు
సీమాంధ్ర జిల్లాల్లో ఎల్లుండి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు సీనియర్ ఐపీఎస్ అధికారులను డీజీపీ పర్యవేక్షకులుగా నియమించారు. ఉభయగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఇన్ ఛార్జిగా వీకే సింగ్, విశాఖ నగరం పర్యవేక్షకుడిగా శివధర్ రెడ్డి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పర్యవేక్షకుడిగా గోపీకృష్ణ, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల ఇన్ ఛార్జిగా సురేంద్రబాబు నియమితులయ్యారు.