: బైక్ పై తరలిస్తుండగా... రూ.50 లక్షలు పట్టుబడ్డాయ్!
కడపలోని పాత రిమ్స్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ద్విచక్ర వాహనంలో రూ. 50 లక్షలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నగదుకు తగిన ఆధారాలు చూపకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.