: నిర్ణయాలన్నీ ప్రధాని, సోరేన్ లవే: దాసరి


బొగ్గుశాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో కేబినెట్ మంత్రి శిబు సోరెన్, ప్రధాని మన్మోహన్ సింగ్ లదే తుది నిర్ణయమని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉంటే ప్రధాని మన్మోహన్ సింగ్ కఠిన చర్యలు తీసుకుని ఉండే వారని అన్నారు. ఒడిశాలోని తలబిరా-II కోల్ బ్లాక్ జిందాల్ కు కేటాయించడంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ, ఇటీవల దాసరిని ప్రశ్నించింది.

ఈ సందర్భంగా బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ చేసిన ఆరోపణల్ని దాసరి ఖండించారు. పరేఖ్ ప్రతిపాదించిన బిడ్డింగ్ ను తాను తిరస్కరించానని, అందుకే పరేఖ్ తనపై సంకుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని దాసరి తెలిపారు. బొగ్గుశాఖకు సంబంధించిన ప్రధాని, కేబినెట్ మంత్రి ఉండగా తానెలా నిర్ణయాలు తీసుకుంటానని దాసరి పరేఖ్ ను ప్రశ్నించారు. తప్పు చేసి ఉంటే ప్రధాని తనను అక్కడి నుంచి విసిరికొట్టేవారని దాసరి అన్నారు.

  • Loading...

More Telugu News