: జగన్ హెలీకాప్టర్లో సాంకేతిక లోపం
వైెఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణించాల్సిన హెలీకాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికల చివరి రోజు కావడంతో వివిధ సభల్లో జగన్ ప్రసంగించారు. అనంతపురం జిల్లా మడకశిర జనభేరిలో పాల్గొన్న జగన్, అక్కడి నుంచి హిందూపురం వెళ్లేందుకు హెలీకాప్టర్లో బయల్దేరారు. ఇంతలో హెలీకాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడడంతో మడకశిర నుంచి రోడ్డు మార్గంలో హిందూపురం వెళ్లారు.