: అవకాశమిస్తే గుజరాత్ సీఎం నేనే: నితిన్ పటేల్
పార్టీ అవకాశమిస్తే ముఖ్యమంత్రి పదవిని చేపడతానని గుజరాత్ మంత్రి నితిన్ పటేల్ తెలిపారు. అహ్మదాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తాను మోడీ స్థానాన్ని భర్తీ చేయగలనని, పార్టీ అవకాశమిస్తే దానిని నిరూపించేందుకు సిద్ధమని తెలిపారు. నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయిన తరువాత గుజరాత్ సీఎం పీఠం ఖాళీ అవుతుందని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటూ చెలరేగుతున్న చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.