: పవన్ కల్యాణ్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన వైకాపా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్ కు వైెఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ నేతలు పంచే డబ్బులను తీసుకుని బీజేపీ, టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ పవన్ కల్యాణ్ ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని వైకాపా ఆరోపించింది. పవన్ పై చర్యలు తీసుకోవాలని కోరింది.