: టీవీలో వంటల ప్రోగ్రాం వాసనతో గుర్తించేయవచ్చు
మధ్యాహ్నం అయ్యేసరికి మహిళామణుల్లో మెజారిటీ టీవీ ఛానెళ్లలో వంటల కార్యక్రమం ట్యూన్ చేసుకుని చూస్తూ ఉంటారు. అక్కడ చేసేచోట వంట ఎలా తగలడిందో గానీ.. చివర్లో యాంకర్ 'ఆహా అద్భుతం.. ' అంటూ నోరూరించే కితాబులు కురిపిస్తుంది. అయితే రుచి గమనించలేకపోయినా.. మీరు ఆ వంట నుంచి వచ్చే వాసనను బట్టి దాని టేస్టును టెస్టు చేయవచ్చు.
ఎందుకంటే ఇక టీవీలు వాసనల్ని కూడా వెదజల్లబోతున్నాయి. జపాన్‌లో ఇలాంటి నవతరం టీవీల ఆవిష్కరణ జరిగింది. ఇలాంటి వాసనల టీవీ తెరవల్ల.. ఆయా సీన్లలో టీవీలో కనిపించే పదార్థాల వాసనలు ఇంట్లో కూచున్న మనకు వస్తుంటాయి. ప్రస్తుతానికి ఇలాంటి వాసన ఒక్కసారే వస్తుందిట. ఎప్పుడూ టీవీ కార్యక్రమాల వాసనలు వెదజల్లుతూ ఉండేలా త్వరలో మరో టెక్నాలజీని అభివృద్ది చేస్తారట. అంటే త్వరలో 'మొగలిరేకులు'కు ఒక వాసన, 'భార్యామణి'కి ఒక వాసన ఆ సీరియళ్లు ఫిక్సయితే గనుక.. పక్కింట్లోంచి ఏ వాసన వస్తోంటే దాన్ని బట్టి ఏ సీరియల్ చూస్తున్నారో కనిపెట్టే టెక్నాలజీ మన సొంతం అవుతుందన్నమాట.