: తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు... చర్చి ఫాదర్ జైలుపాలు
తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 44 ఏళ్ల ఓ చర్చి ఫాదర్ ను తమిళనాడులోని నాగర్ కోయిల్ లో పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. బాలిక తల్లిదండ్రులు క్రైస్తవ మతగురువుపై ఫిర్యాదు చేయడంతో అతను ఏప్రిల్ 25వ తేదీ నుండి పరారీలో ఉన్నాడు. నిందితుడిని వల పన్ని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.
పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కేరళలోని త్రిచూర్ ఆర్చ్ డయాసిస్ లో విధులు నిర్వర్తిస్తున్న ఫాదర్ గత నెలలో బాలికపై మూడుసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికకు సంస్థ తరపున ఉచిత వస్త్రాలు ఇప్పిస్తానంటూ చెప్పిన ఫాదర్... బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అంతే కాకుండా సదరు బాలిక దుస్తులు లేకుండా ఉన్న అశ్లీల చిత్రాలను మొబైల్ ద్వారా చిత్రీకరించినట్లు వారు చెప్పారు. అతడిపై సెక్షన్ - 376(1), 66(ఏ) నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.