: కోల్ స్కాంలో దాసరి, జిందాల్ పై కేసు నమోదు
కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. గనుల కేటాయింపుల్లో క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. జిందాల్ కు బొగ్గు గనులు కేటాయించడానికి బదులుగా దాసరికి చెందిన సినీ నిర్మాణ సంస్థ సిరి మీడియాలో పెట్టుబడి పెట్టారని జిందాల్ పై అభియోగం నమోదైంది.