: కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాదు: ప్రియాంకాగాంధీ
ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ తెలిపారు. వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీ చేయడానికి తాను సిద్ధపడ్డానన్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. తనకు రాజకీయాల్లోకి రావాలన్న కోరిక లేదని స్పష్టం చేశారు.