: అస్తమిస్తున్న సూర్యుడే అసూయపడేలా..


అస్తమిస్తున్న సూర్యుడే అసూయపడేలా.. నిజంగానే ఆకాశం వెలిగిపోయింది. ఐపీఎల్ ప్రారంభ వేడుకల సందర్భంగా బాణాసంచా కాల్పులతో కోల్ కతా అంబరం పట్టపగల్లా మారింది. బాలీవుడ్ జిలుగులు, పిట్ బుల్ ర్యాప్ తళుకులు, చైనీస్ కళాకారుల విచిత్ర విన్యాసాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఘనంగా ఆరంభమైంది. కార్యక్రమం చివర్లో పిట్ బుల్ ఆలపించిన గీతాలు కొన్ని రోజుల వరకు కోల్ కతా వాసులను వెంటాడతాయనడం అతిశయోక్తి కాదేమో. అంతలా సమ్మోహితుల్ని చేశాడీ గానతరంగం.

షో ఆఖరున బాణా సంచా పేలుళ్ళతో సాల్ట్ లేక్ స్టేడియం మిరుమిట్లు గొలిపింది. ఇక, రేపు ప్రారంభం కానున్న సిసలైన సమరానికి తెర లేచినట్టే. బుధవారం సాయంత్రం కోల్ కతాలో సాయంత్రం ఎనిమిదింటికి మొదలయ్యే మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ తో తలపడనుంది. 

  • Loading...

More Telugu News