: కుమార్తె కోసం కోర్టుకెక్కిన టెన్నిస్ ప్లేయర్
ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ తన ఎనిమిదేళ్ల కుమార్తె సంరక్షణ బాధ్యతలు శాశ్వతంగా తనకే ఇవ్వాలని కోరుతూ ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశాడు. మోడల్ రియాతో సహజీవనం కారణంగా వారికి ఒక కుమార్తె కలిగింది. అయితే, రియా మానసిక స్థితి సరిగా లేదని, తన కుమార్తె విషయంలో ఆమె ఎప్పుడూ బాధ్యతగా వ్యవహరించలేదని, కనుక కుమార్తెను తనకే అప్పగించాలని కోరారు. రియాకు వివాహ వ్యవస్థపై తగిన నమ్మకం కూడా లేదని, అందుకే తాను పెళ్లి చేసుకోలేదని తెలిపాడు. ఇప్పుడు తన కుమార్తెను బలవంతంగా విదేశాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నాడు.